మీకు అర్ధం అవుతుందా! .. సిద్ శ్రీరామ్ నుంచి మరో అద్భుతమైన పాట..
బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం 30 రోజుల్లో ప్రేమించటం ఎలా .. అమృత అయ్యర్ కథానాయకగా నటిస్తోంది.
బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం 30 రోజుల్లో ప్రేమించటం ఎలా .. అమృత అయ్యర్ కథానాయకగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని హీరో రానా చేతుల మీదిగా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలోని మొదటి సాంగ్ ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదిగా రిలీజ్ చేశారు.
Happy to launch the first song Neeli Neeli Aakasam from #30RojulloPreminchadamEla!!!
— Mahesh Babu (@urstrulyMahesh) January 31, 2020
This is good stuff @impradeepmachi. Wishing you & the entire team the best! 👍https://t.co/0o6nJEQEeb
మహేష్ బాబు ఈ పాటని ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తూ ... " నీలి నీలి ఆకాశం అంటూ సాగే ఈ పాటను రిలీజ్ చేస్తుండడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ పాటకి చంద్రబోస్ స్వరాలు అందించగా, సిద్ శ్రీరామ్ ఆ పాటకి తన గొంతును ఇచ్చి పాటను మరో స్థాయిలో నిలబెట్టాడు. అంతేకాకుండా ఫీమేల్ సింగర్ గా సునీత కూడా అదరగొట్టారు. అనుబ్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఈ పాట శ్రోతలను వీపరితంగా ఆకట్టుకుంటుంది. హృదయాన్ని హత్తుకునేలా ఉందని కొన్నియడుతున్నారు.
ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్ దగ్గర ఆర్య 2, నేనొక్కడినే సినిమాలకు పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆయన ఈ సినిమాకు కథ మాటలు కూడా అందిస్తున్నాడు. ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వి. బాబు సినిమాని నిర్మిస్తున్నారు. సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి.