పెళ్లికి సిద్ధం అయిన నయనతార!

Update: 2020-05-11 11:07 GMT

ప్రముఖ హీరోయిన్ నయనతార గత కొన్నేళ్లుగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే, వీరిద్దరూ ఇప్పటివరకు తమ బంధంపై బహిరంగంగా స్పందించలేదు. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంటారు. తాజాగా విఘ్నేష్ శివ‌న్ మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో న‌య‌న‌తార ఓ బేబిని ఎత్తుకున్న ఫోటోని షేర్ చేస్తూ.. నా పిల్ల‌లకి జ‌న్మ‌నివ్వ‌బోయే త‌ల్లి చేతుల్లో ఉన్న పాప త‌ల్లికి మాతృదినోత్సవ శుభాకంక్ష‌లు అని కామెంట్ పెట్టాడు.

ఈ పోస్ట్‌తో త్వరలోనే విఘ్నేష్ శివన్‌తో నయనతార పెళ్లి కన్ఫామ్ చేసినట్టు అయింది. మొత్తానికి వీళ్లిద్దరు ఎపుడు పెళ్లి చేసుకుంటారా అని సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. కాగా విజయ్‌ సేతుపతి, నయనతార నటించిన నానుమ్ రౌడీ దాన్‌ సినిమాకు విఘ్నేష్ శివన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో నయన్‌, విఘ్నేష్‌ మధ్య ప్రేమ చిగురించింది. 



 

 

Tags:    

Similar News