సినీ కార్మికులకు 20 లక్షల విరాళం అందజేసిన లేడీ సూపర్ స్టార్

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది.. ఇక చిత్ర పరిశ్రమ విషయానికొస్తే థియేటర్లు మూతపడ్డాయి ఇక షూటింగులు కూడా వాయిదా పడ్డాయి.

Update: 2020-04-05 07:06 GMT
Nayanatara (File Photo)

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది.. ఇక చిత్ర పరిశ్రమ విషయానికొస్తే థియేటర్లు మూతపడ్డాయి ఇక షూటింగులు కూడా వాయిదా పడ్డాయి. దీనితో రోజువారీ కూలీలు చేసుకునే సినీ కార్మికులు బతుకు రోడ్డు మీద పడింది.. దీనితో వీరిని ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ఏకతాటి పైకి వస్తుంది.. ఇప్పటికే సినీ నటులు దర్శకులు సాంకేతిక నిపుణులు తమకు తోచిన సహాయం చేస్తున్నారు.

అందులో భాగంగా లేడీ సూపర్ స్టార్ నయనతార 20 లక్షల విరాళాన్ని ప్రకటించింది.. ఈ విరాళాన్ని ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా కు అందజేశారు.. ఇక ఇప్పటికే శివకార్తికేయన్, ఐశ్వర్య రాజేష్, విజయ్ సేతుపతి మొదలగు సినీ ప్రముఖులు తమకు తోచిన సహాయాన్ని అందజేశారు. త్వరలో ఈ విరాళాలను సినీ కార్మికులకు అందజేయనున్నారు.



Tags:    

Similar News