చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు జాతీయ అవార్డు

అవసరానికి రక్తం అందక చాలా మంది చనిపోతున్నారని తెలుసుకున్న చిరంజీవి 1998 అక్టోబర్‌లో చిరంజీవి

Update: 2019-12-01 16:18 GMT
chiranjeevi blood bank

అవసరమైన సమయంలో చాలా మందికి రక్తం అందించి ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతున్న చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఉత్తమ బ్లడ్ బ్యాంక్ అవార్డ్‌కు ఎంపికైంది. న్యూఢిల్లీలోని 'నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ', హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర 'ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ' నిర్వాహకులు సంయుక్తంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకును ఈ అవార్డుకి ఎంపిక చేశారు.

అవసరానికి రక్తం అందక చాలా మంది చనిపోతున్నారని తెలుసుకున్న చిరంజీవి 1998 అక్టోబర్‌లో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించారు. అప్పటి నుంచి ఈ బ్లడ్ బ్యాంక్ నిరంతరాయంగా సేవలు అందిస్తుంది. చాలా మంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ ద్వారా ఉపాధి పొందిన వారే .. ఈ అవార్డు రావడం వలన మెగా అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగింది. 

Tags:    

Similar News