యూట్యూబ్‌ నుంచి తొలిగించండి.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాం

సినిమా లీకులు అనేవి ఈ మధ్య చాలా జరిగిపోతున్నాయి. వీటికోసం ఎన్ని చర్యలు తీసుకున్నసరే వాటిని ఆపడం కష్టతరం

Update: 2019-12-10 11:42 GMT
Actor Durgaprasad ( File photo)

సినిమా లీకులు అనేవి ఈ మధ్య చాలా జరిగిపోతున్నాయి. వీటికోసం ఎన్ని చర్యలు తీసుకున్న సరే వాటిని ఆపడం కష్టతరం అవుతుంది. అందులో భాగంగానే నటుడు దుర్గా ప్రసాద్‌ హీరోగా నటించిన 'నానిగాడు' సినిమా ఏకంగా యూట్యూబ్‌లో లీక్‌ అయ్యింది. సినిమాని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుండగా, సినిమా మొత్తం యూట్యూబ్‌లో ఉండడంతో చిత్ర బృందం షాక్ అయింది. రూ.40 లక్షలు ఖర్చు పెట్టి 'నానిగాడు' సినిమా తీశామని, సెన్సార్‌ బోర్డ్‌ కూడా యు సర్టిఫికెట్‌ ఇచ్చిందని తెలిపింది.

ఎంతో కష్టపడి చిత్రాన్ని తెరకెక్కిస్తే విడుదల చేయకముందే యూట్యూబ్‌లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మంగళవారం తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద నటుడు దుర్గా ప్రసాద్‌తోపాటు చిత్ర బృందం ఆందోళనకి దిగింది. వెంటనే సినిమాని యూట్యూబ్‌ నుంచి తొలిగించాలని, లేకపోతే బుధవారం ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద ఆత్మహత్య చేసుకుంటమని తెలిపింది.  

Tags:    

Similar News