Viral news: రామానాయుడు స్టూడియో ఇక క్లోజ్ కానుందా?
సినిమా అంటే ఎంతో ఫ్యాషన్ తో సినీ రంగంలోకి అడుగుపెట్టారు నిర్మాత రామానాయుడు.. పలు భాషల్లో సినిమాలను నిర్మించి మూవీ మొఘల్‌గా చరిత్ర సృష్టించారు.
సినిమా అంటే ఎంతో ఫ్యాషన్ తో సినీ రంగంలోకి అడుగుపెట్టారు నిర్మాత రామానాయుడు.. పలు భాషల్లో సినిమాలను నిర్మించి మూవీ మొఘల్‌గా చరిత్ర సృష్టించారు. చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాదుకి షిఫ్ట్ అయ్యాక ఆయన ఇక్కడ రామానాయుడు స్టూడియో పేరుతో రెండు స్టూడియోలను కట్టారు. అందులో ఒకటి ఫిల్మ్ నగర్లో ఉండగా, మరో స్టూడియో నానక్ రామ్‌గూడలో ఉంది.
అయితే నానక్ రామ్‌గూడలోని ఉన్న స్టూడియోని నిర్మాత డి.సురేష్‌బాబు దాన్ని మీనాక్షి కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు డెవలప్మెంట్ కోసమ ఇచ్చేశారని సోషల్ మీడియాలో వార్త హాల్ చల్ చేస్తోంది. ప్లాట్స్‌గా రూపొందించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపైన నిర్మాత సురేష్ బాబు ఎం అంటారో అన్నది చూడాలి మరి! చిన్న పెద్ద అని తేడా లేకుండా ఇక్కడ అన్ని షూటింగ్ జరుగుతూ ఉంటాయి.