ఆ రోజు నాగబాబు లేకుంటే చనిపోయేవాడిని : నాగతేజ

Update: 2019-10-15 14:59 GMT

జబర్దస్త్ అనే కామెడి షో పుణ్యమా అని ఎంతో మంది హాస్యనటులు తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అవుతున్నారు. ఈ షోకి నాగబాబు, రోజా ఇద్దరు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జబర్దస్త్ ఆర్టిస్టులకి ఎలాంటి కష్టం వచ్చినా సహాయం చేయడానికి వీరు ముందుంటారు. సుధీర్ లాంటి కమెడియన్లకు నాగబాబును 'డాడీ' అని పిలిచే సాన్నిహిత్యం కూడా ఉంది.

అందులో భాగంగానే జబర్దస్త్ కమెడియన్ నాగతేజ ఆత్మహత్య చేసుకుంటుంటే నాగబాబు కాపాడారట. ఈ విషయాన్ని స్వయంగా నాగతేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. జబర్దస్త్‌ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి మోసం చేసాడని దీనితో జీవితం మీదా విరక్తి పొంది ఓ హోటల్ లో రూమ్ బుక్ చేసుకొని చనిపోవాలని అనుకున్నాను కానీ చివరి నిమిషంలో నాగబాబు గారికి ఫోన్ చేసి ఫోన్‌లో మాట్లాడానని, ఇలా చనిపోతున్నానని చెప్పడంతో నాగబాబు గారు చాలా దైర్యం చెప్పాడని చెప్పుకొచ్చాడు. ఆ టైంలో నాగబాబు లేకపోయుంటే చనిపోయేవాడని అయన నాకు పునర్జన్మని ఇచ్చారని చెప్పుకొచ్చాడు నాగతేజ ... 

Tags:    

Similar News