ఆ సినిమాలో నాకు డూపు నువ్వే.. అసలు విషయం బయట పెట్టిన నాగ్...

Update: 2019-11-04 10:00 GMT
nagarjuna and srikanth

బిగ్ బాస్ మూడవ సీజన్ ముగిసింది... ఫైనల్ వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి... మెగాస్టార్ చేతుల మీదగా రాహుల్ విజేతగా బిగ్ బాస్ ప్రైజ్ మనీని అందుకున్నాడు. అయితే ఈ ఫైనల్ కి ముందు ఫ్యామిలి హీరో శ్రీకాంత్ బిగ్ బాస్ లోకి స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు.... అప్పుడు నాగ్ శ్రీకాంత్ ని గట్టిగా హగ్ చేసుకొని వెల్ కమ్ చెప్పారు.

ఎన్ని రోజులు అయింది కలిసి .. మనం చాలా సినిమాల్లో చేసాం కదా అని నాగ్ అనగా అవును.. నాలుగు సినిమాలు చేసాం అని శ్రీకాంత్ చెప్పగా లేదు అయిదు సినిమాలు అని నాగ్ అన్నాడు.. ఓ చిన్న నవ్వు నవ్వి నా హలొ బ్రదర్ సినిమాలో నాకు డూపు గా చేసింది శ్రీకాంతే నని అసలు విషయం బయట పెట్టాడు నాగ్...

శ్రీకాంత్ హీరో కాకముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ రోల్ లో నటించాడు. అందులో భాగంగానే హలో బ్రదర్ సినిమాలో నాగార్జునను వెనక నుంచి చూపించే షాట్లలో నటించింది శ్రీకాంతేనని నాగార్జునే స్వయంగా చెప్పారు... ఈ సినిమాకి ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నాగార్జున కెరీయర్లో ఓ గొప్ప సినిమాగా మిగిలిపోయింది.. 

Tags:    

Similar News