అశ్వథ్థామ టీజర్ వచ్చేసింది

Update: 2019-12-27 14:07 GMT
Naga Shaurya

నాగ శౌర్య హీరో గా నటిస్తున్న తాజా చిత్రం అశ్వద్దామ. మేహరీన్ కథానాయకగా నటిస్తోంది,ఈ సినిమాని ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టైటిల్ తో మంచి అంచనాలని కనబరిచింది ఈ సినిమా.. తాజాగా చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది.

ఈ చిత్ర టీజర్ ని సమంత అక్కినేని విడుదల చేశారు. ఎలా ఉంటాడో కూడా తెలియని ఒక రాక్షసుడు. వాడికి మాత్రమే తెలిసిన ఒక రహస్యం. సైరన్ కూతల కింద పనిచేసే వాడి సైన్యం. గమ్యం తెలియని ఒక యుద్ధం. ఆ యుద్ధం గెలవాలంటే ఒక ఆరడుగుల నారాయణ అస్త్రం కావాలి. ఒక అశ్వథ్థాముడు రావాలి'' అంటూ టీజర్ లో హీరో పరిచయం గురించి చెప్పే డైలాగ్ తీజర్ కి బిగ్గెస్ట్ హైలెట్ గా నిలిచింది.

ఇంతవరకు కామెడీ, లవ్ బ్యాక్ గ్రాప్ లో సినిమాలు చేసిన నాగశౌర్య ఫస్ట్ టైం పుల్ టైం యాక్షన్ సినిమాని చేస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. సినిమాని జనవరి 31 న రిలీజ్ చేయనున్నారు. 

Tags:    

Similar News