లక్కంటే నాగ చైతన్యదే.. ఓ రేర్ రికార్డ్

నిజంగా లక్కంటే నాగ చైతన్యదే అని చెప్పాలి.. ఇప్పటి వరకు తెలుగులో మరే హీరో కూడా సాధ్యం కానీ ఘనతను తన సొంతం చేసుకున్నాడు..

Update: 2019-12-06 03:08 GMT
naga chaitanya akkineni

నిజంగా లక్కంటే నాగ చైతన్యదే అని చెప్పాలి.. ఇప్పటి వరకు తెలుగులో మరే హీరో కూడా సాధ్యం కానీ ఘనతను తన సొంతం చేసుకున్నాడు.. బహుశా భవిష్యత్తులో కూడా ఇలాంటి అవకాశం మరే హీరోకి కూడా రాదేమో.. ప్రస్తుతం వెంకీమామ అనే సినిమాలో నటిస్తున్న చైతు మామయ్య వెంకటేష్ తో స్క్రీన్ ని షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా నా కెరియర్ లో ఎన్ని హిట్లు వచ్చినా మనం, వెంకీమామ సినిమాలు నాకు స్పెషల్ అని చెప్పుకొచ్చాడు చైతన్య.. అయితే ఇక్కడే నాగ చైతన్య ఓ రేర్ రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

తన తాత అక్కినేని నాగేశ్వరరావు, నాన్న నాగార్జునలతో కలిసి మనం అనే సినిమాలో నటించాడు చైతూ. అలాగే తన భార్య సమంతతో కలిసి పెళ్లికి ముందు ఏ మాయ చేసావే, మనం, ఆటోనగర్ సూర్య, లాంటి సినిమాల్లో నటించాడు. పెళ్లి తర్వాత మజిలి అనే సినిమాలో నటించాడు. ఇక ఇప్పుడు మేనమామ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకున్నాడు చైతూ... తెలుగు ఇండస్ట్రీలో ఈ అరుదైన అవకాశం మరే హీరోకు వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు.

ఇక బాబీ( కే. యస్ రవీంద్ర) దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాలో చైతూ కార్తీక్ అనే ఆర్మీ పాత్రలో కనిపించనున్నాడు. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని డిసెంబర్ 13 న విడుదల చేయనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించగా, తమన్ సంగీతం అందించాడు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.  

Tags:    

Similar News