నాకు అప్పుడు తెలిసింది డబ్బు విలువ .. నాగబాబు

Update: 2019-06-25 10:22 GMT

ప్రముఖ నటుడు మరియు జబర్దస్త్ జడ్జి నాగబాబు తన యుట్యూబ్ ఛానల్ ద్వారా మరో విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు .. జీవితం అనే బండి నడవాలంటే ధనం అనేది కావాలని అయన అన్నారు ..చాలా మంది మాత్రం మనిషికి డబ్బు కంటే మానవత్వం , వ్యక్తిత్వం ముఖ్యమని చెబుతూ ఉంటారని కానీ అవన్నీ ఉత్త ముచ్చేట్లేనని ఆయన అన్నారు .. కానీ మనిషికి విటన్నికంటే ముందు డబ్బే ముఖ్యమని దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే చాలా ఉపయోగపడుతుందని అయన వాఖ్యానించారు ..

మనిషి కచ్చితంగా డబ్బు సంపాదించాలని తానూ డబ్బు లేక ఇబ్బంది పడిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పుకొచ్చారు .. " నాకు డబ్బు విలువ 49 వ సంవత్సరంలో తెలిసింది . అప్పటి వరకు నేను డబ్బుని దుర్వినియోగం చేయలేదు కానీ డబ్బు సంపాదించలనే కసి మాత్రం నాలో వచ్చేది కాదు . కానీ తర్వాత నేను సంపాదించా అది వేరే సంగతి .మీరు కచ్చితంగా ' ది రిచ్చెస్ట్‌ మ్యాన్‌ ఇన్‌ బాబిలాన్‌' పుస్తకం చదవండి. డబ్బు ఎందుకు సంపాదించాలి. అది ఎలా ఉపయోగపడుతుందన్న విషయం అందులో తెలుస్తుంది.

మీ సంపాదనలో కచ్చితంగా 10 శాతం మనీని సేవ్ చేయండని అ పుస్తకం మీకు చెబుతుంది . నాకు డబ్బు విలువ తేలినప్పటి నుండి చాలా జాగ్రత్త పడ్డానని , ఎవరి దగ్గర ఐతే ఎక్కువ డబ్బు ఉంటుందో వాడే బలవంతుడని ఆదాయం ఎలా పెంచుకోవాలి అనే జ్ఞానన్ని సంపాదించండి అని అయన చెప్పారు ..

Full View

Tags:    

Similar News