'భక్త వత్సలం నాయుడు' గా మోహన్ బాబు
విలన్ పాత్రల నుంచి సినీ కెరియర్ ని మొదలు పెట్టిన మోహన్ బాబు ఆ తర్వాత హీరోగా మారి విభిన్నమైన చిత్రాలలో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు.
విలన్ పాత్రల నుంచి సినీ కెరియర్ ని మొదలు పెట్టిన మోహన్ బాబు ఆ తర్వాత హీరోగా మారి విభిన్నమైన చిత్రాలలో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు. హీరోగానే కాకుండా నిర్మాతగా మారి కూడా పలు విజయవంతమైన చిత్రాలను కూడా నిర్మించారు. గత కొద్దిరోజులుగా అయన సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. చివరగా అయన మహానటి చిత్రంలో నటించారు. చాలా గ్యాప్ తర్వాత అయన హీరో సూర్య నటిస్తున్న 'ఆకాశమే నీ హద్దురా' సినిమాలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో అయన తన ఒరిజినల్ పేరుతోనే నటిస్తున్నారు.
'భక్త వత్సలం నాయుడు' పేరుతో అయన ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇది ఆయన అసలు పేరు కావడం విశేషం. అయితే ఈ సినిమాకి అయన తెలుగుతోపాటు, తమిళంలోనూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. అయితే ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయగా.. దీనిపై మంచు లక్ష్మీ స్పందించారు.ఓహ్ నాన్న తన పుట్టిన పేరును సినిమాలో ఉపయోగించాడని నాకు తెలియదు. యూనిఫామ్‌లో నాన్న ఎంత అందంగా ఉన్నాడో. మా నాన్న ఓ అద్భుతం.' అంటూ ట్వీట్ చేశారు మంచు లక్ష్మి..
Ohh I didn't know he used his birth name. How cool AND just how handsome is appa in that uniform. @Suriya_offl my special mention with graphics better be there!🥳🥳🥳 @themohanbabu my daddy is the awesomest! https://t.co/BPOCo4QH30
— Lakshmi Manchu (@LakshmiManchu) February 28, 2020
నిర్మాతగా మోహన్ బాబు భారీ సినిమా
గత కొద్దీరోజులుగా హిట్ లేక సతమతం అవుతున్న మోహన్ బాబు కుమారుడు విష్ణును హీరో గా పెట్టి 60 కోట్ల బడ్జెట్ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మోహన్ బాబు.. పౌరాణిక చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది . ఈ విషయాన్నీ మోహన్ బాబు స్వయంగా ప్రకటించారు.. ఇక చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఇక అయన రెండో కుమారుడు మంచు మనోజ్ హీరోగా అహం బ్రహ్మాస్మి అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.