షూటింగ్ లు జరిపేదేలా? మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సమాలోచనలు!

లాక్ డౌన్ ఎఫెక్ట్ అన్ని రంగాలపైన పడింది. ఇక సినిమా పరిశ్రమ విషయానికి వచ్చేసరికి షూటింగ్ లు వాయిదా పడ్డాయి.

Update: 2020-05-21 02:22 GMT
Megastar Chiranjeevi(File photo)

లాక్ డౌన్ ఎఫెక్ట్ అన్ని రంగాలపైన పడింది. ఇక సినిమా పరిశ్రమ విషయానికి వచ్చేసరికి షూటింగ్ లు వాయిదా పడ్డాయి. విడుదలకి సిద్దం అయిన సినిమాలు వాయిదా వేసుకున్నాయి. ఇక ధియేటర్లు మూతపడ్డాయి. దీనితో చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. మొత్తానికి కొన్ని కోట్ల నష్టాన్ని అయితే ఇండస్ట్రీ చూసింది. అయితే మళ్ళీ షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయి. ధియేటర్లు మళ్ళీ ప్రేక్షకులతో ఎప్పుడు కళకళలాడుతాయి అన్నది సగటు సినీ అభిమాని ప్రశ్న.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ సినీ పరిశ్రమకి సంబంధించి ప్రభుత్వ నిబంధనలు అలాగే కొనసాగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితిలో షూటింగ్ లు సాధ్యమేనా? సెట్స్‌లో చాలా మంది ఉంటారు. ఒక పక్క లాక్ డౌన్ ఎత్తేసినా బౌతిక దూరం తప్పనిసరని ప్రభుత్వం చెప్పుకొస్తుంది కాబట్టి సెట్స్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అనుమతుల కోసం ప్రభుత్వాలను సంప్రదిద్దామా? అనే విషయాల గురించి చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో దర్శకులు, నిర్మాతలు, నటులు, పంపిణీదారులు, సమావేశం కానున్నారని తెలిసింది.

వీలైంత త్వరగా షూటింగ్ లు ప్రారంభించడానికి ఏం చేయాలి. సినిమా షూటింగ్ లు, విడుదల వంటి విషయాల్లో ఎలా వ్యవహరించాలి. నిబంధనలకు అనుగుణంగా సినిమా పరిశ్రమను ఎలా ముందుకు తీసుకుపోవాలనే అంశాలపై ఈ భేటీ జరగబోతోందని తెలుస్తోంది.

ఈ సమావేశంలో పలు విషయాలను చర్చించి ఒక ప్రణాళికను సిద్దం చేసి ఆ తర్వాత చిత్ర పరిశ్రమ తరపున తెలంగాణ ప్రభుత్వాన్నీ సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షూటింగ్ లకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

      

Tags:    

Similar News