చిరులో తగ్గని జోష్.. అలనాటి తారలతో మెగాస్టార్ స్టెప్పులు

తెలుగు వెండితెరపై డాన్స్ అంటే మెగాస్టార్ ..మెగాస్టార్ అంటేనే డాన్స్.. ఎంతమంది హీరోలు వచ్చిన డాన్స్ లో చిరంజీవిని మాత్రం బీట్ చేయడం లేదు.

Update: 2020-05-03 16:21 GMT
Chiranjeevi 1980's actor reunion (File Photo)

తెలుగు వెండితెరపై డాన్స్ అంటే మెగాస్టార్ ..మెగాస్టార్ అంటేనే డాన్స్.. ఎంతమంది హీరోలు వచ్చిన డాన్స్ లో చిరంజీవిని మాత్రం బీట్ చేయడం లేదు. ఆ జోష్ ని అందులోలేకపోతున్నారు. ఇక ఈ మధ్య ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి కరోనా పైన అవగాహన కల్పిస్తునే మరోపక్కా కావాల్సినంత ఫన్ ని అందిస్తున్నారు. ఈ రోజు(ఆదివారం) చిరంజీవి అలనాటి హీరోయిన్లు అయిన సుహాసిని, ఖుష్బూ, జయసుధ, రాధ, రాధక, లిజి ప్రియదర్శన్‌లతో కలసి చిరంజీవి స్టెప్పులేసిన వీడియోను షేర్ చేశారు. అయితే ఇది ఇప్పటి వీడియో కాదు.. గత ఏడాది చిరంజీవి కొత్త ఇంటిలో ఈ రీయూనియన్ జరిగింది.

అయితే ఈ రియునియన్ వేడుకకి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నటీనటులు ఒక చోట కలిసి సందడి చేశారు. వెంకటేష్, నాగార్జున, మోహన్‌లాల్, రాధిక, శరత్ కుమార్, ప్రభు, రెహమాన్, భానుచందర్, నరేష్‌, సురేష్‌, జయసుధ, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, భాగ్యరాజ్‌, జాకీ ష్రాఫ్‌, జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో నటీనటులంతా చాలా హ్యాపీగా గడిపారు. ఆటపాటలతో కలసి సందడి చేశారు. అయితే ఇందులో చిరంజీవి సుహాసిని, జయప్రద, జయసుధ, రాధ, రాధిక లతో కలిసి స్టెప్స్ వేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. అలనాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు.. ప్రస్తుతం

ఈ వీడియో ఇప్పుడు మెగా అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

ఇక గత ఏడాది సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది..మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది. 



Tags:    

Similar News