లాక్ డౌన్ సమయంలో పోలీసుల కృషిని ప్రశంసిస్తూ మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్టు చేశారు. 'రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోలీసుల పనితీరు అద్భుతం. నిద్రాహారాలు మాని వారు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్ లో చూస్తున్నాను. వారి పనితీరు వల్ల లాక్ డౌన్ సక్సెస్ అయింది. పోలీసుల పనితీరు వల్ల లాక్డౌన్ విజయవంతంగా జరుగుతోంది.
అలా జరగడం వల్లే ఈ కరోనా వ్యాప్తి చాలా వరకూ అదుపులోకి వచ్చింది. ఈ మహమ్మారిని అంతమొందించడంలో సామాన్య జనం పోలీసులకు సహకారం అందించాలని నేను ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నాను. కరోనాను తుదిముట్టించడంలో, అంతమొందించడంలో వారికి చేదోడువాదోడుగా మనందరం ఉండాలి. పోలీసులు అందిస్తున్న సేవలకు ఓ పోలీసు బిడ్డగా చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాను. జైహింద్.' అని చిరంజీవి పేర్కొన్నారు.
#SalutingCoronaWarriors @TelanganaDGP @TelanganaCOPs #UnitedAgainstCorona pic.twitter.com/9LOFWD9irk
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2020