క్రికెట్ పరిభాషలో సచిన్ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన చిరు

కొంచం ఆలస్యంగా ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి కానీ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

Update: 2020-04-28 14:35 GMT
Megastar Chiranjeevi, Sachin Tendulkar (File Photo)

కొంచం ఆలస్యంగా ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి కానీ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. కావలసినంత ఫన్ అందిస్తూనే అభిమనులకి కరోనా పైన అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా తన మనవరాలు అయిన నవిష్కతో సందడి చేసిన చిరు దీనికి సంబంధించిన వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా (ఏప్రిల్ 23) న భారత మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు చిరు..

దీనికి కృతజ్ఞతగా సచిన్ మీ అమూల్యమైన మాట‌ల‌కి ధ‌న్యవాదాలు..మీరంద‌రు క్షేమంగానే ఉన్నార‌ని ఆశిస్తున్నాను అని సచిన్ కి ట్వీట్ చేశారు. దీనికి చిరంజీవి క్రికెట్ పరిభాషలో బదులిచ్చారు. అంతా క్షేమం. ఇప్పటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో డిఫెన్స్ ఆడడమే సరైన విధానం. నేను అందరికీ ఇదే విషయం చెబుతున్నానని చిరు ట్వీట్ చేశారు..

ఇక ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాని చేస్తున్నారు. ఇది చిరంజీవికి 152వ సినిమా.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా సోషల్ మెసేజ్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ప్రస్తుతం కరోనా ప్రభావం వలన సినిమా వాయిదా పడింది..


Tags:    

Similar News