శ్రీకాంత్‌ని పరామర్శించిన చిరంజీవి

Update: 2020-02-17 10:47 GMT

సినీ హీరో మేక శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు నిన్న రాత్రి చనిపోయిన సంగతి తెలిసిందే.. ఈ వార్తను తెలుసుకున్న సినీ, రాజకీయప్రముఖులు హుటాహుటిన అయన శ్రీకాంత్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఈ నేపద్యంలో మెగాస్టార్ చిరంజీవి పరమేశ్వరరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీకాంత్‌ను, ఆయన కుటుంబీకులను పరామర్శించారు..శ్రీకాంత్‌కు చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు.

ఇక గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మేక పరమేశ్వర్‌రావు స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. అయన 1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకావారి పాలెంలో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటక లోని గంగావతి జిల్లా బసవ పాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు.

చిన్న చిన్న పాత్రలతో, విలన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీకాంత్ నెమ్మదిగా హీరోగా మారాడు. వన్ బై టు హీరోగా అయన మొదటి సినిమా.. తాజ్ మహల్ , పెళ్ళి సందడి, ఎగిరే పావురమా, ప్రేయసి రావే వంటి చిత్రాలు ఆయనకి మంచి పేరును తీసుకువచ్చాయి. ఇక సినీ నటి ఉహని శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గరు సంతానం. 


Tags:    

Similar News