మెగా పవర్ స్టార్ @12 ఏళ్ళు

Update: 2019-09-29 12:04 GMT

మెగాస్టార్ తనయుడుగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్.. చెర్రి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి సరిగ్గా 12 సంవత్సరాలు పూర్తయింది.. చిరుత అయన మొదటి సినిమా.. ఈ సినిమా 28 సెప్టెంబర్ 2007లో రిలీజైంది. ఆ చిత్రానికి ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడిగా ఫిలింఫేర్ ని అందుకున్నాడు. ఆ తర్వాత రెండో సినిమాకే 50కోట్ల క్లబ్ లో అడుగుపెట్టి సంచలనం సృష్టించాడు. ఈ సందర్భంగా తన భార్య ఉపాసన, హీరోయిన్ తమన్నా తో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. హీరోయిన్ తమన్నా రామ్ చరణ్ తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపింది... ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో ఉన్నాయి.. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అంతే కాకుండా చిరంజీవి నటించిన సైరా సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున విడుదల చేయనున్నారు. ఇందులో తమన్నా ఓ ప్రత్యేకమైన పాత్రలో మేరవనుంది.

Tags:    

Similar News