సినీ నటుడు, నిర్మాత మంచు విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్నిమంచు విష్ణు ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'స్పెషల్ ప్రదేశం నుంచి స్పెషల్ ప్రకటన. ఇది విన్నీ స్వస్థలం. నాకెంతో ఇష్టమైన ప్రదేశం. ఇప్పటికే మా కుటుంబంలోకి అరియానా, వివియానా, అవ్రామ్ వచ్చారు. ఇప్పుడు నాలుగో ఏంజిల్ కూడా రాబోతోంది' అని పేర్కొంటూ తన భార్యతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. తన భార్య విరానిక కూడా తమ ఫ్యామిలీలోకి మరొకరు రాబోతున్నారని తెలిపింది. ఈ వార్తతో మంచు అభిమానులలో ఆనందం వెల్లివిరిసింది.