మంచు ఫ్యామిలీతో మెగాస్టార్..

Update: 2019-10-28 10:38 GMT

దీపావళి సందర్భంగా హీరో మంచు విష్ణు ఏర్పాటు చేసిన విందులో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి తన కుమార్తె అయిన ఐరా విద్యను పరిచయం చేస్తూ మురిసిపోయారు విష్ణు.. మనందరికీ ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి అంకుల్ కి ఐరా విద్యను పరిచయం చేశాను అని విష్ణు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ అభిమానులతో పంచుకున్నాడు . ఇందులో విష్ణు భార్య వినారికా కూడా ఉన్నారు. ఈ మధ్యే సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగస్టార్ చిరంజీవి.. సినిమా మంచి సక్సెస్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి..  



Tags:    

Similar News