మల్లేశం సినిమాకి వినోదపు పన్ను రాయితీ ఇప్పిస్తాం : కేటిఅర్

Update: 2019-06-15 14:35 GMT

చింతకింది మల్లేశం జీవిత కధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మల్లేశం.. ఈ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ రోజు సినిమాను చూసిన ఆయన మీడియాతో మాట్లాడారు . ఒక సామాన్యుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు బాగుందని చెప్పుకొచ్చారు . మల్లేశం పాత్రలో ప్రియదర్శి బాగా నటించారని అన్నారు . ఈ చిత్రానికి మాటలు అంధించిన పెద్దింటి అశోక్ ని ప్రశంసించారు కేటీఆర్ . ఆయనని అజ్ఞాతసూర్యుడని కొనియాడారు కేటిఅర్. అయితే ఈ చిత్రానికి ప్రభుత్వం తరపున అన్నివిధాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. సినిమాటోగ్రఫి మంత్రితో మాట్లాడి వినోదపు పన్ను రాయితీ వచ్చేలా చూస్తానని మాటిచ్చారు కేటీఆర్. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసుందని చెప్పారు. 

Full View

Tags:    

Similar News