తెలుగు రాష్ట్రాల‌కి రూ.10 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించిన కొరటాల, అనిల్ రావిపూడి

కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తుంది. ఇప్పటికే 195 దేశాలకు పైగా వ్యాపించి విలయ తాండవం చేస్తోంది.

Update: 2020-03-26 08:24 GMT
Anil ravipudi, koratala Shiva (File Photo)

కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తుంది. ఇప్పటికే 195 దేశాలకు పైగా వ్యాపించి విలయ తాండవం చేస్తోంది. ప్ర‌భుత్వం కూడా క‌రోనాని త‌రిమికొట్టేందుకు కొన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతుంది. ఇక ప్రభుత్వానికి సహాయం చేసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు. ఇక ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ రూ. 2 కోట్లు, టాలీవుడ్ హీరో నితిన్ ఏపీ, తెలంగాణకు రూ.10 లక్షల రూపాలయ చొప్పున విరాళాలును అందజేశారు. తాజాగా హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి 50 లక్షల రూపాయల చొప్పున కోటి రూపాయలను, ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. కోటి రూపాయలను అందజేస్తున్నట్లు ప్రకటించారు. రామ్ చరణ్ 70 లక్షలు అందజేశారు.

ఇక తాజాగా హిట్ చిత్రాల ద‌ర్శ‌కులు కొరటాల శివ, అనిల్ రావిపూడి తెలుగు రాష్టాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో ఐదు లక్షల రుపాయలను అందజేస్తున్నట్లు ప్రకటించారు..! తమవంతుగా సహాయం చేయగలిగిన వారు ముందుకు వచ్చి తమవంతుగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక దూరం ప్ర‌తి ఒక్క‌రు పాటించాల‌ని, క‌రోనా నివార‌ణ‌లో భాగంగా ప్ర‌భుత్వం చేప‌ట్టిన లాక్ డౌన్‌ని ప్ర‌తి ఒక్క‌రు సక్సెస్ చేయాల‌ని కోరారు. ఇక మరో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెరో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి చెరో పది లక్షల రుపాయలను అందజేస్తున్నట్లు వెల్లడించారు.




ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది. ప్రపంచంలో ఇప్పటికే 20 వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక భారత్లో 630 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..

Tags:    

Similar News