చిరు పక్కన త్రిష .. ఆల్మోస్ట్ ఫిక్స్ ?

Update: 2019-10-18 12:35 GMT

ఖైది నెంబర్ 150 సినిమా తర్వాత చాలా గ్యాప్ లో సైరా విడుదలైంది. ఇప్పుడు ఆ గ్యాప్ ని ఫుల్ ఫిల్ చేసే పనిలో ఉన్నారు చిరు.. వెనువెంటనే సినిమాలు షూరు చేస్తున్నారు. ఇప్పటికే తన 152వ సినిమాని కొరటాల దర్శకత్వంలో మొదలు పెట్టేశారు చిరు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ తో కొణిదెల ప్రొడక్షన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

అయితే సినిమాలో హీరోయిన్ గా ఎవరన్నది మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. చిరు పక్కన అనుష్క, నయనతార ,కాజల్ పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. తాజాగా త్రిష పేరు కూడా వినిపించింది. అయితే సినిమాలో త్రిషను తీసుకునేందుకే ఎక్కువగా ఆసక్తి చుపిస్తున్నారట చిత్ర బృందం.. గతంలో మురగదాస్ దర్శకత్వంలో త్రిష, చిరంజీవి కలిసి స్టాలిన్ అనే సినిమాలో నటించారు.

ఇప్పుడు త్రిషకి ఇక్కడ అంతా మార్కెట్ లేదు. కానీ ఓ స్టార్ హీరోతో సినిమా పడితే మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని తహతహలాడుతుంది. అన్ని కుదిరితే స్టాలిన్ కాంబినేషన్ ని మనం మళ్ళీ చూడొచ్చు .. దేవాలయాల బ్యాక్ గ్రాప్ లో సినిమా తెరకేక్కుతుందని సమాచారం.. ఇందులో చిరంజీవి దేవాదాయ,ధర్మదాయ శాఖాలో పనిచేస్తాడని తెలుస్తుంది. సినిమా ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ నటిస్తాడని సమాచారం.. 

Tags:    

Similar News