తమిళ యువ నటుడు సేతురామన్ గుండెపోటుతో మృతి

త‌మిళ యువ న‌టుడు సేతురామ‌న్ గుండెపోటుతో మృతి చెందారు..రాత్రి గుండెపోటు రావడంతో ఆయనకి చెన్నైలోని తన నివాసంలో మృతి చెందారు.

Update: 2020-03-28 06:46 GMT
Kollywood actor Sethuraman

త‌మిళ యువ న‌టుడు సేతురామ‌న్ గుండెపోటుతో మృతి చెందారు..రాత్రి గుండెపోటు రావడంతో ఆయనకి చెన్నైలోని తన నివాసంలో మృతి చెందారు. సేతు రామన్ నటుడు మాత్రమే కాదు.. వృత్తిరీత్యా వైద్యుడు కూడా... చెన్నైలో స్కిన్ కేర్ క్లినిక్‌ ఏర్పాటు చేసి అక్కడ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. ఆయన మరణంతో తమిళ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది.. సేతురామ‌న్ త‌మిళ హాస్య‌ న‌టుడు సంతానానికి అత్యంత స‌న్నిహితుడు.

ఆయన సినిమాల్లో ఎక్కువగా నటించిన ఆయన రజినీకాంత్, శింబు చిత్రాల్లో కూడా నటించారు. ఆయనకి ప్రస్తుతం 37 ఏళ్లు.. ఇటీవలే సేతురామన్‌కు ఉమయాల్‌తో ఫిబ్రవరి 12 2016లో వివాహం జరిగింది. ఆయనకు ఏడాది వయసున్న కూతురు కూడా ఉంది. 2013 లో విడుదలైన కన్నా లడ్డూ తిన్నా ఆసయ్య చిత్రం ద్వారా నటుడిగా అరంగేట్రం చేశారు. మణికందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతానం, సేతు, పవర్‌స్టార్ శ్రీనివాసన్, విశాఖా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే కాకుండా వాలిబా రాజా, సక్కా పోడు పోడు రాజా మరియు 50/50 అనే పలు చిత్రాల్లో నటించారు.

సేతురామన్ ఆకస్మిక మరణం తమిళ చలనచిత్ర పరశ్రమనీ షాక్ కి గురి చేసింది. ఖుష్బు, చిత్రనిర్మాత వెంకట్ ప్రభు, నిర్మాత ధనంజయన్ మరియు ఇతరులు తమ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలుపుతున్నారు. మంచి మిత్రుడ్ని కోల్పోయాం అంటూ తమ భాదను వ్యక్తం చేస్తున్నారు. 




Tags:    

Similar News