ముందుగా 'మహానటి' చెయొద్దు అనుకున్నాను: కీర్తి సురేష్

నేను శైలజ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది మలయాళ నటి కీర్తి సురేష్.

Update: 2019-12-28 05:07 GMT

నేను శైలజ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది మలయాళ నటి కీర్తి సురేష్..మొదటి సినిమాతోనే అటు అందం ఇటు అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ.. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరవాత చేసిన మహానటి సినిమా కీర్తి కెరియర్ ని పూర్తిగా మార్చేసింది. ఏకంగా ఈ సినిమాకి జాతీయ అవార్డుని గెలిచుకుంది. అప్పటివరకు గ్లామర్ పాత్రలు చేసుకుంటూ వచ్చిన కీర్తికి ఫస్ట్ టైం నటనకి తగ్గ పాత్ర దక్కింది.

జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదిగా జాతీయ అవార్డు అందుకునే సమయంలో తన ఒళ్లు గగుర్పొడిచిందని చెప్పుకొచ్చింది కీర్తి. అయితే ముందుగా ఈ కథని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పినప్పుడు అంత గొప్ప కథను నేను చేయలేననిపించిందని, అప్పుడు వద్దు అనుకున్నానని కానీ మా మామయ్య గోవింద్‌ నన్ను ఆ సినిమా చేసేలా ఒప్పించారు.


అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఆ పాత్రకు నన్ను తప్ప వేరేవాళ్లను అనుకోలేకపోతున్నానని చెప్పారని చెప్పుకొచ్చింది. దీనికి కారుకులైన వీరికి ధన్యవాదాలు చెప్పింది కీర్తి.ఈ సినిమాకి గాను ఒక పక్క ఫిలింఫేర్‌, మరోపక్క జాతీయ స్థాయి అవార్డులను అందుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని, అసలు నా సినీ కెరీర్‌లో జాతీయ అవార్డు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదని చెప్పుకొచ్చింది.

దీనికితోడు రజినీకాంత్ 168 మూవీ షూటింగ్‌లో భాగంగా ఫిలింఫేర్‌ను ప్రకటించిన తర్వాత సెట్‌లో రజనీ సర్‌ కేక్ కట్‌ చేయించారని, ఇంతకంటే గొప్ప ఇంకేమి కావాలని చెప్పుకొచ్చింది. నాకు వచ్చిన ఈ అవార్డును సావిత్రమ్మకి అంకితం చేస్తున్నానని చెప్పుకొచ్చింది కీర్తి.. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తుంది కీర్తి . మిస్‌ ఇండియా, గుడ్‌లక్‌ సాక్షి, రంగ్‌ దే. ఇవే కాకుండా మలయాళంలో మోహన్‌లాల్‌ తో ఓ సినిమా, తమిళంలో పెంగ్విన్‌. సినిమా చేస్తుంది కీర్తి.  

Full View

Tags:    

Similar News