పాపం క్యాథరిన్ ఆ వ్యాధితో బాధపడుతుందట...

Update: 2019-10-20 12:44 GMT

వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన చమ్మక్ చల్లో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది క్యాథరిన్ ట్రెసా... ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి నటిగా ఒకే అనిపించుకుంది. ఇక అల్లు అర్జున్ తో చేసిన ఇద్దరమ్మాయిలతో, సరైనోడు సినిమాలు ఆమెకి మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా తరవాత క్యాథరిన్ తెలుగు సినిమాల్లో కనిపించకుండా పోయింది. చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో నటిస్తుంది.

తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన క్యాథరిన్ తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తనకు అనోస్మియా అనే వ్యాధి ఉందని వెల్లడించింది క్యాథరిన్ .. ఎలాంటి వాసనలని అయిన కనిపెట్టలేకపోవడం ఈ వ్యాది యొక్క ముఖ్యం లక్షణం అన్నమాట.. వాసనలు గుర్తించే శక్తి వారిలో పూర్తిగా శూన్యం అని చెప్పాలి. అందువల్ల తానూ పెళ్లి చేసుకోకూడదని భావిస్తున్నానని, కానీ సినిమాల్లో నటిస్తానని చెప్పుకొచ్చింది క్యాథరిన్

Tags:    

Similar News