ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాత : ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

Update: 2020-05-28 03:52 GMT

టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన జ‌యంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ మనవడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. 'మీరు లేని లోటు తీరనది' అంటూ పేర్కొన్నారు. తాత ఎన్టీఆర్‌ ఫోటోని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేస్తూ .. ' మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా' అంటూ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశాడు జూనియ‌ర్. ఇక క‌ళ్యాణ్ రామ్ కూడా త‌న ట్విట్ట‌ర్‌లో మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోత అంటూ శ్రద్ధాంజ‌లి ఘ‌టించారు.



 



హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

 


Tags:    

Similar News