Union Budget 2020: జనసేనలో నా ప్రయాణం ముగిసిన అధ్యాయం : జేడీ

Update: 2020-02-03 02:07 GMT

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయన రాజీనామా లేఖను కూడా పవన్ ఆమోదించారు. ఇక ఆ తర్వాత జేడీ మీడియాతో మాట్లాడింది లేదు. తాజగా అయన విశాఖపట్నంలో పర్యటించారు. అక్కడ మీడియాతో మాట్లాడిన అయన జనసేనలో నా ప్రయాణం ముగిసిన అధ్యాయమేనని, రాజీనామాకు గల కారణాలను రాజీనామా లేఖలోనే తెలిపానని అయన అన్నారు. ఇంకా తానూ ఎ పార్టీలోకి వెళ్ళాలి అన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

ముందుగా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుంటనని ప్రజా సేవకు రాజకీయమే అత్యుత్తమ వేదిక అని అన్నారు. సోమవారం 'ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్‌'ను ప్రారంభిస్తున్నట్లు జేడీ చెప్పుకొచ్చారు. ఇక తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి అయన స్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహితంగానే ఉందని, రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు బాగున్నాయని తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని నిధులు రాబట్టేందుకు 25 ఎంపీలు ప్రయత్నించాలని అయన సూచించారు.

సీబీఐ జేడీగా పని చేసిన లక్ష్మీనారాయణ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అయన జనసేన పార్టీలో చేరి విశాఖపట్నం ఎంపీగా పోటి చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ వచ్చారు. తాజగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం అయన బీజేపీలో చేరనున్నరాన్న ప్రచారం బాగా నడుస్తోంది. 

Tags:    

Similar News