క్వీన్ టిజర్ వచ్చేసింది

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత బయోపిక్ తెరకెక్కుతుంది.. జయలలితపై మొత్తం మూ

Update: 2019-12-01 13:34 GMT
jayalalitha Biopic

ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. సినీ, రాజకీయ నాయకుల జీవితాలను బయోపిక్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకనిర్మాతలు.. అందులో భాగంగానే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత బయోపిక్ తెరకెక్కుతుంది.జయలలితపై మొత్తం మూడు బయోపిక్ లు తెరకేక్కతుడడం విశేషం..

ఇందులో రెండు సినిమాలు కాగా మరోకటి వెబ్ సిరీస్.. అయితే ఈ వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటిస్తుంది. గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన టిజర్ ని చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. " స్కూల్ డేస్ లో స్టేట్ టాపర్ .. 18  ఏళ్ళకి టాప్ హీరోయిన్ , అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి, మిమల్ని ఎంతగానో ఆకట్టుకునే క్వీన్ మీకోసం ఎదురుచూస్తుంది. #queencoming అని చిత్ర బృందం పేర్కొంది. చిత్ర ట్రైలర్ ని డిసెంబ‌ర్ 5న విడుదల చేయనున్నారు.. 
 

ఇక కంగన రనౌత్ ప్రధాన పాత్రలో జయలలిత బయోపిక్ తెరకెక్కుతుంది.. దీనికి త‌లైవి అనే టైటిల్ ని పెట్టారు. ఏఎల్ విజ‌య్ ఈ బ‌యోపిక్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం..  

Full View

Tags:    

Similar News