వర్మ పెదకర్మ అంటూ బ్యానర్స్ .. ఆసక్తికరమైన ట్వీట్ చేసిన ఆర్జీవీ

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెద్దకర్మ అంటూ జన సైనికులు తమ ఉక్రోషాన్ని వెళ్లగక్కారు.. దీనికి సంబంధించిన

Update: 2019-12-14 15:38 GMT
RGV

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెద్దకర్మ అంటూ జన సైనికులు తమ ఉక్రోషాన్ని వెళ్లగక్కారు.. దీనికి సంబంధించిన పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేస్తూ సోషల్ మీడియాలో హాల్ చల్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వర్మ దీనిపైన స్పందించారు.

"దయచేసి అర్ధం చేసుకోండి. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా జస్ట్ ఫన్ కోసం మాత్రమే తీశా. నేను గాడ్ ప్రామిస్‌గా చెప్తున్నా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ బాబులను ప్రేమిస్తున్నా. వాళ్ల ఫాలోవర్స్ మీద ఒట్టు.. ముఖ్యంగా కోడూరుపాడు జనసేన ఫాలోవర్స్‌ మీద ఒట్టేసి చెబుతున్నా నమ్మండి'అంటూ పోస్ట్ చేశారు వర్మ.. అంతేకాకుండా దీనికి ముందు అదే పోస్టర్ పైన వర్మ స్పందిస్తూ" మీ లీడర్ ని దయ్యం అయి పట్టుకోవడానికి అతి త్వరలో వస్తున్నా" అని మరో ట్వీట్ చేశాడు వర్మ..

అసలు ఎం జరిగింది?

తాజాగా వర్మ దర్శకత్వంలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాని డిసెంబర్ 12న విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ రాజకీయ నాయకులూ చూట్టూ కథ ఉండడం, అందులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను నెగిటివ్‌గా చూపించడంతో జనసైనికులు ఫైర్ అయ్యారు . అందులో భాగంగానే తమ నాయకుడిని అవమానించారని సోషల్ మీడియాలో వర్మపై కౌంటర్లు వేస్తున్నారు.

ఈ క్రమంలోనే కోడూరుపాడు జనసేన యూత్ సభ్యులు వర్మకు పెదకర్మ నిర్వహిస్తున్నట్టుగా ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఆ ప్లేక్సిలో "నీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు కలిగించాలని నీ ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లో శాంతి చేకూరకూడదని భవవంతున్ని ప్రార్ధిస్తూ జనసేన యూత్- కోడూరు పాడు"  అంటూ భారీ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జోహార్ బాస్టర్డ్ అంటూ ఆ ప్లేక్సిలో పేర్కొన్నారు. దీనితో వర్మ దీనిపైన తన సోషల్ మీడియాలో స్పందించాడు. 



Tags:    

Similar News