అలాంటి వారితో నాకు సంబంధం లేదు.. ప్రేమించే వారికే తోడుగా ఉంటా: ఫ్యాన్స్‌కు లేఖ రాసిన జగపతి బాబు

Jagapathi Babu: జగపతి బాబు.. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలో నటించిన హీరోగా మంచి పేరుంది.

Update: 2023-10-08 06:38 GMT

అలాంటి వారితో నాకు సంబంధం లేదు.. ప్రేమించే వారికే తోడుగా ఉంటా: ఫ్యాన్స్‌కు లేఖ రాసిన జగపతి బాబు

Jagapathi Babu: జగపతి బాబు.. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలో నటించిన హీరోగా మంచి పేరుంది. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న జగపతి తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రాలు పోషిస్టూ విలక్షణ నటుడిగా మెప్పిస్తున్నారు. అంతేకాదు అభిమానులను ఆదుకునే విషయంలోనూ జగపతి బాబు హీరోనే. అయితే జగపతి బాబు అభిమానులపై కొంత కోపం, అసహనం, ప్రేమ వ్యక్తం చేస్తూ లెటర్ రాశాడు.

'అందరికీ నమస్కారం. 33 ఏళ్లుగా నా కుటుంబం, శ్రేయోభిలాషుల్లా.. అభిమానులు కూడా నా పెరుగుదలకు ముఖ్యకారణంగా భావించాను. వాళ్ల ప్రతి కుటుంబ విషయాల్లో పాల్గొని వాళ్ల కష్టాల్ని నా కష్టాలుగా భావించి నాకు తోడుగా ఉన్న నా అభిమానులకు నీడగా ఉన్నాను. అభిమానులంటే అభిమానం, ప్రేమ ఇచ్చేవాళ్లని మనస్పూర్తిగా నమ్మాను. కానీ బాధకరమైన విషయం ఏంటంటే.. కొంతమంది అభిమానులకు ప్రేమ కంటే అశించడం ఎక్కువైపోయింది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక నుంచి అభిమాన సంఘాలు, ట్రస్టుతో నాకు సంబంధం లేదు. వాటి నుంచి విరమించుకుంటున్నాను. కేవలం ప్రేమించే అభిమానులకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను' అని జగపతిబాబు ట్వీట్ చేశాడు.

అయితే, జగపతిబాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం తెలియరాలేదు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘గుంటూరు కారం’, ‘సలార్‌’ వంటి సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు.



Tags:    

Similar News