ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్‌తో విజయ్
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా సినిమాలతో ఫుల్ సక్సెస్ లో ఉన్నాడు విజయ్ దేవరకొండ
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా సినిమాలతో ఫుల్ సక్సెస్ లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో `వరల్డ్ ఫేమస్ లవర్` అనే సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే విజయ్ దేవరకొండ భార్య పాత్రలో నటిస్తోన్న ఐశ్వర్యా రాజేష్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ లుక్ కి గాను మంచి స్పందన వస్తుంది.
ఇప్పుడు ఈ సినిమాలోని మరో హీరోయిన్ ఇజాబెల్లె లెయితె లుక్‌ను విడుదల చేశారు. ఇజా అనే పాత్రలో నటిస్తోన్న ఇజా బెల్లె లెయితె ఫ్రాన్స్‌లో ఉంటుంది. నిన్న విడుదల చేసిన ఐశ్వర్యా రాజేష్ లుక్ కి, ఈ రోజు విడుదల చేసిన ఇజాబెల్లె లెయితె లుక్ కి అసలు సంబంధం లేదు. ఈ రెండు లుక్స్‌లో విజయ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నటిస్తోన్న మరో ఇద్దరు హీరోయిన్స్ అయిన క్యాథరిన్ త్రెసా, రాశీఖన్నాలకు సంబంధించిన లుక్స్ విడుదల కావాల్సి ఉంది. జనవరి 3న సినిమా టీజర్ ని విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాని ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా తర్వాత విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని పూరి, చార్మీ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.
Gautham, Iza, Paris ❤
— Vijay Deverakonda (@TheDeverakonda) December 13, 2019
This Valentine's Day - World Famous Lover. pic.twitter.com/c6qC4bBv3N