మరోసారి రచ్చ చేయబోతున్న ఇస్మార్ట్ శంకర్ టీం ..

Update: 2019-07-29 15:37 GMT

డాషింగ్ డైరెక్టర్ , యంగ్ హీరో రామ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపుతుంది . ఇప్పటికే ఈ సినిమా 63 కోట్లు వసూళ్ళు చేసినట్టు చిత్ర నిర్మాత ఛార్మి తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు . సినిమా సక్సెస్ మీట్ ని ఈ మధ్యనే నిర్వహించిన టీం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని పలు దియేటర్లో ప్రేక్షకుల మధ్య సినిమా సక్సెస్ ని మరింత ఎంజాయ్ చేస్తుంది . త్వరలోనే తెలంగాణాలో కూడా పర్యటించనుంది చిత్ర యూనిట్ . అయితే సినిమా విడుదలకు ముందే హీరో రామ్ అమెరికాకి వెళ్ళాడు . చిత్ర యూనిట్ సినిమా సక్సెస్ ఎంజాయ్ మెంట్ లో రామ్ లేకపోవడంతో రామ్ మరో రెండు రోజుల్లో హైదరాబాద్ కి రానున్నాడు . హీరో రామ్ తో కలిసి మరో సక్సెస్ మీట్ ని అరేంజ్ చేయనుంది టీం .. రామ్ కలిసి మరోసారి ఎంజాయ్ చేద్దామని ఛార్మి తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది


Tags:    

Similar News