YOUTUBEలో రచ్చ రచ్చ చేస్తున్న ఇస్మార్ట్ పాట ...

Update: 2019-09-23 10:58 GMT

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ,డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ సినిమాలో రామ్ కి జోడిగా నిధి అగర్వాల్, నభా నటేష్ నటించారు. ఈ సినిమా చాలా కాలం తర్వాత పూరికి దర్శకుడిగా మరియు నిర్మాతగా చాలా సంతృప్తిని ఇచ్చింది. ఇక రామ్ కి కూడా తన కెరియర్ లో గుర్తిండిపోయే సినిమాగా నిలిచింది. అయితే తాజాగా చిత్ర యూనిట్ సినిమాలోని దిమాక్ ఖరాబ్ సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. ఈ పాటకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. విడుదలైనప్పటి నుండే పాట రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది. మొత్తం కోటి వ్యూస్ ని సంపాదించుకుంది. ఈ పాటని కేవలం మూడురోజుల కిందే రిలీజ్ చేసారు. 

Full View

Tags:    

Similar News