వరల్డ్ కప్ ఎఫెక్ట్ ... ఇస్మార్ట్ శంకర్ వాయిదా

Update: 2019-06-22 10:44 GMT

ఎనర్జిటిక్ హీరో రామ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకేకుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్ .. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలకి మరియు టిజర్ కి విశేషమైన స్పందన వచ్చింది .. దీనితో సినిమా పైన మంచి అంచనాలే ఉన్నాయి .. ఈ సినిమాలో నభా నటేష్ మరియు నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు .. అయితే ఈ సినిమాని వచ్చే నెల 12 న విడుదల చేయాలనుకుంది .. కానీ ప్రస్తుతం వరల్డ్ కప్ సీజన్ కావడంతో సినిమా విడుదలని మరో వారం రోజులు వెనుకకి జరిపింది .. వరల్డ్ కప్ ఫీవర్ బాగా ఉండడంతో సినిమాకి ప్రేక్షకులు వచ్చే అవకాశం తక్కువే .. ఈ ఎఫెక్ట్ ఇస్మార్ట్ శంకర్ పైన పడే ప్రాభవం ఉండడంతో సినిమాని వాయిదా వేసింది చిత్ర బృందం .. ఈ సినిమా జులై 18 న విడుదల కానుంది.. 



Tags:    

Similar News