సూపర్ స్టార్ రజనీకాంత్ కి అరుదైన గౌరవం..

Update: 2019-11-02 11:25 GMT
Rajinikanth

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయనకి ఫ్యాన్స్ దేశ నలుములాల కూడా ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఆయనకి అరుదైన గౌరవం దక్కింది. 50వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) 2019 వేడుకలో ఆయన్ను ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించనున్నారు... భారతీయ సినిమాకు గాను అయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డుని ప్రకటించనున్నారు.

ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ తన అధికార ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన అభిమాన నటుడుకి ఈ గౌరవం దక్కడం చాలా ఆనందంగా ఉందని అయన అభిమానులు ఫీల్ అవుతున్నారు. దీనిపైన రజినీకాంత్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక గౌరవానికి ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపారు. ఈ కార్యక్రమం నవంబర్ 20 నుండి 28 వరకు జరనుంది.  



Tags:    

Similar News