ఇక అలాంటి పాత్రలను చేయను : పాయల్ రాజ్ పుత్

Update: 2019-12-23 14:50 GMT
payal Rajput (File Photo)

ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది పాయల్ రాజ్ పుత్.. చేసిన మొదటి సినిమాతోనే కుర్రకారును తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటి.. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాయల్ కి క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇక రొమాన్స్ ప్రధానంగా కలిగిన సినిమాల్లోనే పాయల్ కి అవకాశాలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఆర్డీఎక్స్ 100  లవ్  అనే సినిమాని చేసింది పాయల్. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది.

ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో రొమాన్స్ ని పక్కన పెట్టి 'వెంకీమామ' సినిమా చేసింది పాయల్.. ఈ సినిమా ఆమెకి విజయాన్నిచ్చింది. హిందీ టీచర్ పాత్రలో ఆమె నటనకి గాను మంచి మార్కులే పడ్డాయి. వెంకీమామ మంచి సక్సెస్ కావడంతో నటనకి ప్రాధాన్యత కలిగిన సినిమాలనే ఎంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె రవితేజ హీరోగా నటిస్తున్న 'డిస్కోరాజా' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాని జనవరిలో రిలీజ్ చేయనున్నారు.  

Tags:    

Similar News