హైపర్ ఆది.. ఇమిటేట్ చేసి ఇరిటేట్ చేశాడు!

Update: 2019-10-15 11:58 GMT

జబర్దస్త్ షోలో హైపర్ ఆది అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆది వేసే పంచులకి.. అతని స్కిట్స్ కి జనాలు పడిపడి నవ్వుతారు. షోని టీవీలోనే కాదు... యుట్యుబ్ లో కూడా ఆది స్కిట్స్ ఎక్కువగా చూస్తున్నారంటే మనోడికి ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోండి. ఇక ఆది మెగా ఫ్యాన్ అని పెద్దగా చెప్పాల్సిన ఆవసరం లేదు. చాలా సందర్భంలో ఈ మాట రుజువు అయ్యింది కూడా..

చేసే ప్రతి స్కిట్ లో కూడా ఆది మెగా హీరోస్ కి సంబంధించిన పాటతోనే ఎంట్రీ ఇస్తాడు . అప్పుడప్పుడు వారు నటించిన సినిమాలోని గెటప్ లను స్కిట్ గా మార్చడం మనోడి స్పెషాలిటి.. అందులో భాగంగానే గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్, సైరా సినిమాల గెటప్ లను వాడుకొని స్కిట్ గా మలిచి అలరించాడు. అయితే ఇప్పుడు దాని విషయంలోనే మెగా ఫ్యాన్స్ నోచ్చుకుంటున్నారట.  ఇటీవల ఓ స్కిట్ లో ఆది సైరా గెటప్ తొ కామెడీ చేశాడు. అది బాగా పేలింది కూడాను. కానీ, సూపర్ హిట్ అయిన చిరంజీవి గెటప్ ని కామెడీకి వాడుకుంటావా ఆది? ఇది సరైన పధ్ధతి కాదంటూ మెగా ఫ్యాన్స్ ఆదిని ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక అభిమానిగా ఇటువంటి పనిచేయడం ఏమిటంటూ మండిపడుతున్నారు. 

నవ్వించడం కోసం చేసినా కూడా మెగా స్టార్ చిరంజీవిని ఇమిటేట్ చేసి ఫ్యాన్స్ ని ఇరిటేట్ చేశావు ఆది అని మెగా అభిమానులు విసుక్కుంటున్నారు. 


Tags:    

Similar News