'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్ ను కంప్లీట్ చేసిన విజయ్ దేవరకొండ
ప్రస్తుతం టాలీవుడ్ లో "బీ ది రియల్ మ్యాన్" అనే ఛాలెంజ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగ మొదలుపెట్టిన ఈ ఛాలెంజ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో "బీ ది రియల్ మ్యాన్" అనే ఛాలెంజ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగ మొదలుపెట్టిన ఈ ఛాలెంజ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇక ఆ తర్వాత రాజమౌళి నుంచి జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ నుంచి కొరటాల, కొరటాల శివ నుంచి విజయ్ దేవరకొండ వరకు చేరింది. కొరటాల ఛాలెంజ్ ను స్వీకరించిన విజయ్ దేవరకొండ ఇంటిపనులతో పాటు కొన్ని హౌజ్ హోల్డ్ టిప్స్ కూడా చెబుతున్నాడు.
వైన్, ఆల్కహాల్ బాటిల్స్ ను తాగేశాక వాటిని వాటర్ బాటిల్స్‌గా ఉపయోగిస్తూ అందులో నీటిని నింపి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఆ తర్వాత లీటర్ నీటిని తాగాడు. పాత కవర్స్‌ని డస్ట్ కవర్స్‌గా ఉపయోగించాలని వీడియోలో పేర్కొన్నాడు. ఆ తరవాట్ మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసి తన కుటుంబ సభ్యులకి అందించాడు. టీవీ తుడిచి గేమ్ ఆడాడు. ఇక ఈ చాలెంజ్ ను మహానటిలో తనతో కలిసి యాక్ట్ చేసిన దుల్కర్ సల్మాన్‌కు విసిరాడు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పూరి, చార్మీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం కరోనా ప్రాభవంతో సినిమా వాయిదా పడింది. సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి.
Bits of my day in lockdown :)
— Vijay Deverakonda (@TheDeverakonda) April 25, 2020
Documented by @ananddeverkonda#BeARealMan challenged by @sivakoratala sir. I would like to extend it to Kunjikkaa @dulQuer pic.twitter.com/8bLAAQYeMo