పవన్ ఫాన్స్ కి రామ్ చరణ్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ...

Update: 2019-08-28 15:49 GMT

హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకులు అప్పుడే ప్రారంభం అయ్యాయి . సెప్టెంబర్ 02న పవన్ కళ్యాణ్ 48వ జన్మదిన వేడుకలను జరుపుకోనున్నారు . ఈ నేపధ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ని అందించాడు. అభిమానుల్లో జోష్ నింపేందుకు సోషల్ మీడియాలో పవన్ పోస్టర్ ని విడుదల చేసాడు రామ్ చరణ్ ...

ఇందులో పవన్ రెండు వేరియేషన్స్ ఉన్న ఫోటోల్లో కనిపిస్తున్నారు. ఒక ఫోటోలో పవన్ నవ్వుతుండగా, మరో ఫోటోలో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపిస్తున్నారు . ఇక మధ్యలో సెలైన్ సూదులు ఉన్న పవన్ చేయి కనిపిస్తుంది . దాని కింద జనసేనాని అని పెట్టి "మార్పు వచ్చే వరకు ఎత్తులేస్తా" అని స్లోగన్ ని ఉంచారు . దీనితో పవన్ ఫాన్స్ కి ఇది కామన్ డీపీగా మారిపోయింది. ఈసారి పవన్ బర్త్ డే వినాయక చవితితో కలిసి రావడంతో ఇదే అసలైన పండగ అని ఫాన్స్ భావిస్తున్నారు . ప్రస్తుతం ఈ ఫోటో #PawanKalyanBirthdayCDP హ్యాష్ ట్యాగ్ తో వైరల్ అవుతుంది . 

Full View

Tags:    

Similar News