RRR నుంచి అల్లూరి సీతారామరాజు వచ్చేశాడు!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.. (రౌద్రం, రణం, రుధిరం).. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2020-03-27 12:08 GMT
Ram Charan

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.. (రౌద్రం, రణం, రుధిరం).. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.. ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి సప్రైజ్ వీడియోను విడుదల చేసింది. "ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్లు ఉంటది.. కలబడితే యేగు సుక్క ఎగబడినట్లు ఉంటది. ఎదురుబడితే సావుకైనా చెమట ధార కడతది. బాణమైనా, బందూకైనా ఆనికి బాంచన్‌ ఐతది. ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు'' అంటూ గంభీరమైన ఎన్టీఆర్‌ వాయిస్‌తో రామ్ చరణ్ ని అల్లూరి సీతారామరాజు పాత్రను విడుదల చేశాడు దర్శకధీరుడు రాజమౌళి..మొత్తం వీడియోలో రామ్ చరణ్ స్టిల్స్ ఒకెత్తి అయితే ఎన్టీఆర్‌ గంభీరమైన వాయిస్‌ మరో ఎత్తుగా నిలిచింది.

పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటిచింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని,శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు. 


Full View


Tags:    

Similar News