హీరో రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్..తప్పిన ప్రమాదం..

Update: 2019-08-20 06:08 GMT

హైదరాబాద్ అల్కాపూర్ ఓఆర్ఆర్‌పై హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులోని వారికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్‌ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్టు తెలిసింది. యాక్సిడెంట్‌ అనంతరం ఆయన వేరే కారులో వెళ్లిపోయినట్టు స్థానికులు చెప్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News