హీరోగా చేసుకుంటేనే సినిమా నిర్మాణం వైపు అడుగులు వేశారు నేచురల్ స్టార్ నాని .. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్‌తో నిర్మాతగా మారి అ అనే సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమాకి గాను జాతీయ అవార్డు కూడా లభించింది. చేసిన మొదటి ప్రయత్నం మంచి విజయం సాధించడంతో నాని నిర్మాతగా మరో సినిమాని మొదలుపెట్టాడు.
ఫలక్‌నుమా దాస్ సినిమాతో పాపులర్ ఆయినే హీరో విశ్వక్ సేన్‌తో నాని ఓ సినిమా తీయబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ క్రిస్మస్ పండగ సందర్బంగా సినిమాకి సంబందించిన లుక్ ని బయటకు వదిలాడు నాని. అయితే ఈ సినిమాకి గాను హిట్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశాడు నాని. ఈ సినిమాలో విశ్వక్ సేన్ విక్రమ్ రుద్రరాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆయనే హ్యాండిల్ చేయగలడని నాని ట్వీట్లో పేర్కొన్నారు. న్యూఇయర్ రోజున ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను అభిమానులతో షేర్ చేసుకోబోతున్నట్లు నాని ప్రకటించారు.
ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా రుహానీ శర్మ నటిస్తోంది. ఇక నాని ముచ్చటగా మూడోసారి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో v అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో నానితో పాటు సుధీర్‌బాబు కూడా నటిస్తున్నాడు. నివేదా థామస్, అదితి రావు హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఉగాది పండగకి కానుకగా రిలీజ్ చేయనున్నారు. సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి.
Meet Vikram Rudraraju (Superintendent of Police, IPS), who is all set to embark on a nerve-racking journey to unravel the mysterious case.
— Wall Poster Cinema (@walpostercinema) December 25, ౨౦౧౯
You will witness the first glimpse of his journey on 1st Jan 2020. #HITMovie #VishwakSen @iRuhaniSharma @PrashantiTipirn @NameisNani pic.twitter.com/aSCXN4zuQr