ఛలో సినిమా కథ నాదే.. అదే నేను చేసిన తప్పు

Update: 2019-12-27 16:38 GMT
Nagashourya

ఛలో సినిమాకి తానే కథ రాశానని.. కానీ, టైటిల్స్‌లో తన పేరు వేసుకోలేదని అంటున్నారు యంగ్ హీరో నాగశౌర్య. తాజాగా అయన 'అశ్వథ్థామ' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఆయనే కథ అందించి సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. రమణ తేజ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నాగశౌర్య మదర్ ఉషా ముల్పూరి నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని జ‌న‌వ‌రి 31న విడుద‌ల‌ చేయనున్నారు.

అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర టీజర్ ని అక్కినేని సమంత ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ.. ముంబైలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథని రాసుకున్నానని, బ్లాక్ బస్టర్ అవుతుందని గర్వంగా చెప్పగలనని అన్నారు. లవర్ బాయ్ గా నాకు మంచి ఇమేజ్ ఉందని అంటారు కానీ నాకు అది నచ్చదు. అందుకే దానినుండి బయటకు రావడానికే ఈ సినిమా చేస్తున్నాని, అందరికి నచ్చుతుందని నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చాడు నాగశౌర్య.

అంతేకాకుండా ఛలో' సినిమాకు కథ నేనే రాశానని, కానీ అ సినిమాకి నేను పేరు వేసుకోకపోవడం పెద్ద తప్పు అయిందని, ఆ తప్పు ఇక్కడ జరగకూడదని నా పేరు వేసుకున్నాను. అంతకు మించి ఇంకేమీ లేదంటూ చెప్పుకొచ్చాడు. ఇక విడుదలైన చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటుంది. "ఎలా ఉంటాడో కూడా తెలియని ఒక రాక్షసుడు. వాడికి మాత్రమే తెలిసిన ఒక రహస్యం. సైరన్ కూతల కింద పనిచేసే వాడి సైన్యం. గమ్యం తెలియని ఒక యుద్ధం. ఆ యుద్ధం గెలవాలంటే ఒక ఆరడుగుల నారాయణ అస్త్రం కావాలి. ఒక అశ్వథ్థాముడు రావాలి'' అంటూ టీజర్ లో హీరో పరిచయం గురించి చెప్పే డైలాగ్ టీజర్ కి బిగ్గెస్ట్ హైలెట్ గా నిలిచింది. 

Full View

Tags:    

Similar News