'సరిలేరు' నుంచి మూడో పాట వచ్చింది

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. భారీ అంచనాల

Update: 2019-12-16 14:00 GMT
sarileru neekevvaru

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి-11న రిలీజ్ కాబోతుంది. చిత్రీకరణకి చివరి దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ ని ఇప్పటికే మొదలు పెట్టింది. అందులో రెండు సాంగ్స్ ని రిలీజ్ చేసింది. తాజాగా మూడవ పాటను కూడా రిలీజ్ చేసింది.

"హి ఈజ్‌ సో క్యూట్‌..హి ఈజ్‌ సో స్వీట్..హి ఈజ్‌ సో హ్యాండ్సమ్‌, హి ఈజ్‌ సో హాట్ " అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటుంది. శ్రీమణి ఈ పాటను రాయగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మధుప్రియ ఈ పాటను ఆలపించారు. ఇందులో మహేష్, రష్మిక ల మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఇద్దరి మధ్య విజువల్స్ బాగా వచ్చాయి.

అనిల్ సుంకర, దిల్ రాజు లతో కలిసి మహేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో రావు రమేష్, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత తదితరులు కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో అలనాటి తార విజయశాంతి రీఎంట్రీ ఇస్తుంది. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.   

Full View

Tags:    

Similar News