ఆదివారం గొల్లపూడి అంత్యక్రియ‌లు

Update: 2019-12-12 10:56 GMT
గొల్లపూడి మారుతీరావు

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో జరుగుతాయని ఆయన రెండో కుమారుడు రామకృష్ణ తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి చెన్నైలోని ఆయన నివాసానికి గొల్లపూడి భౌతికకాయాన్ని తరలించనున్నారు. కుటుంబసభ్యులు, బంధువులు విదేశాల నుంచి వచ్చే వరకు లైఫ్ లైన్ ఆస్పత్రిలోనే గొల్లపూడి భౌతికకాయాన్ని ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం గొల్లపూడి పార్థివదేహన్ని, చైన్నైలోని ఆయన నివాసంలో ఉంచుతారు.  

Tags:    

Similar News