బాహుబలికి డైలాగ్ కింగ్ పంచ్

తాజాగా ప్రభాస్, మోహన్ బాబుని కలిశారు. ఇద్దరి చాలా ఫన్నీగా మాట్లాడుకున్నారు. ఇంతకీ వీరిద్దరూ మాట్లాడుకున్నా

Update: 2019-11-21 14:50 GMT
mohan babu and prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి మంచు మోహన్ బాబు కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. మంచు వారి ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ప్రభాస్ కచ్చితంగా అటెండ్ అవుతాడు. అయితే తాజాగా ప్రభాస్, మోహన్ బాబుని కలిశారు. ఇద్దరి చాలా ఫన్నీగా మాట్లాడుకున్నారు. ఇంతకీ వీరిద్దరూ మాట్లాడుకున్నా విషయం ఏంటంటే ముక్కు గురించి మాట్లాడుకున్నారు. చిన్నప్పుడు నా ముక్కు చాలా షార్ప్ గా ఉండేదని, దానితో టమాటాలు కోశేవారని ప్రభాస్ చెబుతూ మరి మీరేం కోశారని మోహన్ బాబుని అడగగా దానికి అయన బదులిస్తూ కోడి మెడ కోశానని సమాధానం ఇవ్వడంతో ఇద్దరు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్ మోహన్ బాబు కలిసి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో కలిసి నటించారు. ప్రస్తుతం ప్రభాస్ కే రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.



Tags:    

Similar News