అర్జున్ సురవరం ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
అసలు విడుదల అవుతుందా లేదా అనే సందిగ్దంలో ఉన్న నిఖిల్ అర్జున్ సురవరం సినిమా ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నిఖిల్ కి జోడిగా అందాల భామ లావణ్య త్రిపాఠి నటించింది.
అసలు విడుదల అవుతుందా లేదా అనే సందిగ్దంలో ఉన్న నిఖిల్ అర్జున్ సురవరం సినిమా ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నిఖిల్ కి జోడిగా అందాల భామ లావణ్య త్రిపాఠి నటించింది. తమిళ్ లో వచ్చిన కనితన్ సినిమాకి ఈ సినిమా రీమేక్.. కనితన్ సినిమాకి దర్శకత్వం వహించిన టి. సంతోషే కొన్ని మార్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కించాడు.
నిన్న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకులనుండి మంచి స్పందన వచ్చింది. నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం అనే పాయింట్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడిస్తూ మంచి మెసేజ్ ఇచ్చి సక్సెస్ కొట్టారు... అయితే తొలిరోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.4.1 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో నిఖిల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సినిమాని ఆదరించిన ప్రతిఒక్కరికి థాంక్స్ చెప్పాడు నిఖిల్..
వాస్తవానికి అర్జున్ సురవరం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా లేట్ అవుతూ వచ్చి పలు సార్లు వాయిదా పడింది. ఈ తరుణంలో అన్ని అడ్డంకులను కోల్పోయి నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చి బ్లెస్ చేయడం సినిమాకి చాలా ప్లస్ అయింది. ప్రస్తుతం నిఖిల్ రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు.
Thank u Asian Movies for staying strongly behind us all through The delays and hurdles... Happy it's paying off 🙏🏽 https://t.co/Ctphpk6XTL
— Nikhil Siddhartha (@actor_Nikhil) November 30, 2019