Budget 2020: ఎంటర్‌టైన్మెంట్ సెక్టార్ పై ఊసే లేదు

2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

Update: 2020-02-01 10:41 GMT

2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్ లో విద్యా, వైద్య ఆరోగ్య మొదలైన రంగాలపైన పోకస్ చేసిన కేంద్రం చిత్ర పరిశ్రమ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. 2019 మధ్యంతర బడ్జెట్‌ లో చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీ బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులతో చర్చించి వినోదాత్మక రంగానికి కేటాయింపులు ఇచ్చారు.

ఇక 2019 మధ్యంతర బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ భారతీయ చిత్ర పరిశ్రమ గురించి ప్రస్తావించారు. సినిమా టికెట్లపై జీఎస్టీని తగ్గిస్తూ.. రూ.100 టికెట్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. రూ.100 మించిన టికెట్ల ధరపై 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించారు 2019-2020 బడ్జెట్‌లో మాత్రం ఎంటర్‌టైన్మెంట్ సెక్టార్ పైన మాటే లేకపోవడం గమనార్హం.  

Tags:    

Similar News