ఎంత మంచివాడవురా త్రీ డేస్ కలెక్షన్స్
సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో ఎంత మంచివాడవురా సినిమా ఒకటి. కళ్యాణ్ రామ్ , మేహరీన్ కలిసి నటించిన ఈ చిత్రాన్ని శతమానం భవతి ఫేం సతీష్ విగేశ్న దర్శకత్వం వహించారు.
సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో ఎంత మంచివాడవురా సినిమా ఒకటి. కళ్యాణ్ రామ్ , మేహరీన్ కలిసి నటించిన ఈ చిత్రాన్ని శతమానం భవతి ఫేం సతీష్ విగేశ్న దర్శకత్వం వహించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి షోకి ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఆ తరవాత షోస్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ సంఖ్యలో వెళ్ళడంతో సినిమాకి మంచి వసూళ్లను రాబడుతుంది. కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించింది. మొత్తం ఈ చిత్రం 3 రోజులకు గాను 4.90 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ సినిమాకి మొత్తం 12.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంకా 8 కోట్లు సాదిస్తే బ్రేక్ ఈవెన్ సాధించినట్టే అవుతుంది.
ఇక ఈ చిత్రం 3 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
♦ నైజాం 1.08 cr
♦ సీడెడ్ 0.65 cr
♦ ఉత్తరాంధ్ర 0.50 cr
♦ ఈస్ట్ 0.66 cr
♦ వెస్ట్ 0.44 cr
♦ కృష్ణా 0.44 cr
♦ గుంటూరు 0.51 cr
♦నెల్లూరు 0.17 cr
♦ ఏపీ+తెలంగాణ 4.45 cr
♦ రెస్ట్ ఆఫ్ ఇండియా 0.26 cr
♦ ఓవర్సీస్ 0.19 cr
♦ వరల్డ్ వైడ్ టోటల్ 4.90 cr (share)
ఇక ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సుహాసిని, శరత్ బాబు, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ప్రవీణ్, పూజా రామచంద్రన్, అపూర్వ, రచ్చ రవి తదితరులు నటించారు. ఈ సినిమాని ఆదిత్య ప్రైవేటు లిమిటెడ్ పై సుభాష్ గుప్తా, ఉమేష్ గుప్తా కలిసి నిర్మించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.
ఇక ఈ సినిమా తరవాత కళ్యాణ్ రామ్ తన నిర్మాణ సంస్థ అయిన ఎన్టీఆర్ఎ ఆర్ట్స్ పై జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడనుంది.